Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-2 : గీతా దెబ్బకు కౌషల్ అవుట్..

మర్డర్ మిస్టరీ టాస్క్ కొనసాగింపుగా బుధవారం మరింత రసవత్తరంగా మారింది. ఈ టాస్క్ ప్రకారం గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో, రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా, గీతా మాధు

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (10:40 IST)
మర్డర్ మిస్టరీ టాస్క్ కొనసాగింపుగా బుధవారం మరింత రసవత్తరంగా మారింది. ఈ టాస్క్ ప్రకారం గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో, రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా, గీతా మాధురి హంతకురాలిగా, మిగిలిన సభ్యులు పబ్లిక్‌గా ఉన్నారు. మర్డరర్‌గా ఉన్న గీతా మాధురి. మంగళవారం ఎపిసోడ్‌లో కొన్ని సీక్రెట్ టాస్క్‌లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో పాటు శ్యామల మరియు కౌషల్‌ను మర్డర్ చేసింది.
 
బుధవారం ఎపిసోడ్‌లో సామ్రాట్, అమిత్‌, దీప్తిలను హత్య చేసింది. అయితే గణేష్ ఈ హత్యల్ని ఎవరు చేస్తున్నారో కనిపెట్టాల్సింది పోయి ఓవర్ బిల్డప్‌తో కాలం గడిపేసాడు. ఇంట్లో వాళ్లందరూ గీతే హంతకురాలని కనిపెట్టేసినా.. గణేష్ మాత్రం ఓవర్ యాక్షన్‌కే పరిమితమయ్యాడు. బెడ్‌పై పసుపు పడేస్తూ డైరెక్ట్‌గా గీతా మాధురి దొరికేసినా ఆమె చెప్పినవి నమ్మేసి కేసును పక్కకు మళ్లించాడు. గీతకి ఇచ్చిన ఐదు సీక్రెట్‌ టాస్క్‌లను కంప్లీట్ చేసినట్లు బిగ్ బాస్‌కి తెలియజేసింది గీతా మాధురి.
 
కనుక బిగ్ బాస్ చెప్పినట్లు ఈ సీజన్ మొత్తంలో ఆమెకు నామినేషన్స్ ఉండకపోవడమే కాకుండా.. ఒకర్ని సీజన్ మొత్తంలో నామినేషన్‌లో ఉంచే బంగారు అవకాశం ఆమెను వరించింది. రేపటి ప్రోమోలో చూస్తే టైటిల్‌కి గట్టి పోటీ ఇస్తున్న కౌశల్‌పై ఈ ఎలిమినేషన్ అస్త్రాన్ని గీతా సంధించినట్లు చూపుతున్నారు. అంటే ప్రతివారం జరిగే నామినేషన్స్‌లో కౌషల్ ఉండబోతున్నాడని తెలుస్తోంది. గీతా కూడా ఇంత గడసరి అని ఇప్పుడే తెలుస్తోంది మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments