గురువారం (30-08-2018) దినఫలాలు - స్త్రీలకు పొరుగువారి నుంచి...
మేషం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వలన మనస్థాపం తప్పవు. సోదరీసోదరులతో సంబంధ భాంధ
మేషం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వలన మనస్థాపం తప్పవు. సోదరీసోదరులతో సంబంధ భాంధవ్యాలు బాగుగా ఉంటాయి. రాజకీయ నాయకులకు దూరప్రయాణాలలో మెళకువ అవసరం.
వృషభం: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. హోటలు, తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిధునం: భార్య, భర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. ఇప్పటివరకు వాయిదా పడుతున్న వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. మీ మేలు పొందినవారే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు.
కర్కాటకం: ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. రావలసిన బాకీలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
సింహం: ఉద్యోగాభివృద్ధి కోసం చేసే యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు విలాసాలు, అలంకారాలు పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సహచరుల సహకారం వలన రాజకీయాలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వీలైనంత వరకు మితంగా సంభాషించండి.
కన్య: మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఖర్చులు చెల్లింపులు అధికంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడుతాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పొరుగువారి నుండి ఆహ్వానం అందుతుంది. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.
తుల: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి.
వృశ్చికం: కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిదికాదు. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
ధనస్సు: ప్రతి విషయం మీ జీవితభాగస్వామికి తెలియజేయడం మంచిది. మీ కదలికలపై నిఘాఉందన్న విషయాన్ని గమనించండి. సోదరీసోదరుల మధ్య తగాదాలు రావచ్చు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
మకరం: మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. బంధువుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
కుంభం: వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాలవారికి గుర్తింపు లభిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
మీనం: సొంత నిర్ణయాల వలన కలహాలు, చికాకులు తప్పవు. ట్రాన్స్పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఉచిత సలహా ఇచ్చి ఎదుటివారి ఉద్రేకానికి లోనుకాకండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.