సోమవారం (27-08-2018) దినఫలాలు - మనసు లగ్నం చేసి పనిపై శ్రద్ధ పెట్టినా ...
మేషం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. కమీషన్‌దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్‌చాతుర్యముండును. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవ
మేషం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. కమీషన్‌దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్‌చాతుర్యముండును. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.
వృషభం: తలపెట్టిన పనులు ద్విగ్విజయంగా పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. స్వయం కృషితో రాణిస్తారు. స్త్రీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
మిధునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేల్ రంగాలవారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.
కర్కాటకం: కుటుంబీకుల నుండి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. ఎదుటివారు మీకు సమానులేనని గ్రహించండి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు.
సింహం: రావలసిన డబ్బు చేతికి అందడం వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. దూరప్రయాణాలలో పరిచయాలు ఏర్పడుతాయి. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి, పట్టుదల చాలా అవసరం. కుటుంబములో స్వల్ప విబేధాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు.
కన్య: కొంతమంది మీ నుండి పెద్ద మెుత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
తుల: సైన్స్, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రాప్తించబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
వృశ్చికం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. త్వరలో గృహ మరమ్మత్తులు, మార్పులు చేపడుతారు. మీ తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకు గురవుతారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. బంధుమిత్రులు సహాయ, సహకారాలు అందిస్తారు.
ధనస్సు: మనసు లగ్నం చేసి పనిపై శ్రద్ధ పెట్టినా ఆశించిన ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వృత్తి వ్యాపారాల్లో మెుహమ్మాటాలు, ఒత్తిళ్లకు అవకాశమివ్వకండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
మకరం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యవసాయ రంగాలవారికి ఎరువుల కొనుగోలులో చికాకులు అధికం. సోదరీసోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం: సర్దుబాటు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. ప్లీడరు నోటీసుకు దీటుగా స్పందిస్తారు. విద్యార్థినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దలు, మీ శ్రీమతి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. క్రీడా, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహకరం.
మీనం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. ఎలక్ట్రానిక్, మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడడం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి.