Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా బిగ్ బాస్ ఆగలేదుగా.. ప్రోమో వచ్చేసిందిగా..

Webdunia
సోమవారం, 20 జులై 2020 (22:10 IST)
BB4
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో టీవీ షోలు జరిగే అవకాశాల్లేవని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రతరం అవుతున్న తరుణంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం కానుందనే సంకేతాలు వెలువడ్డాయి. తద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ ఏడాది బిగ్‌బాస్‌ షో ఉంటుందా? లేదా? అనే అనుమానాలున్నాయి. కానీ వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌-4 పై స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బిగ్‌బాస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు బిగ్‌బాస్‌ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 
 
బిగ్‌బాస్‌ సీజన్‌-4పై స్టార్‌ మా క్లారిటీ ఇవ్వడంతో.. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు, హోస్ట్‌ వివరాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ సెట్‌ వర్క్స్‌ ప్రారంభమయ్యాయి. అలాగే కంటెస్టెంట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది.

త్వరలోనే మొదలయ్యే ఈ షోలో కంటెస్టెంట్స్‌గా ఈ సారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేయాలని చూస్తున్నారు స్టార్ మా. దీనికోసం భారీగానే ఖర్చు చేసి మరీ పేరున్న వాళ్లనే బిగ్ బాస్ హౌజ్‌కు పట్టుకొస్తున్నారని తెలుస్తుంది. 
 
ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. అలాగే సంచలన యాంకర్ రష్మి గౌతమ్‌కు భారీ మొత్తం ఇచ్చి బిగ్ బాస్ 4లో తీసుకోవాలని చూస్తున్నారు. మరో యాంకర్ కమ్ సింగర్ మంగ్లీ కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌కు వస్తుందని ప్రచారం జరుగుతుంది.

సింగర్ గీతా మాధురి భర్త నందుకు బిగ్ బాస్ 4 ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జోరుగానే జరుగుతుంది. హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌కు ఎలాగూ ఆఫర్స్ లేవు.. అందుకే బిగ్ బాస్ వైపు అడుగులేస్తుందని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

దేవాన్ష్ ప్రపంచ రికార్డు : మనవడిపై సీఎం బాబు ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments