Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్.. మార్నింగ్ మస్తీ.. గంగవ్వ డ్యాన్స్ అదరగొట్టింది..

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (10:45 IST)
బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎపిసోడ్ 27లో మార్నింగ్ మస్తీలో భాగంగా మెహబూబ్ ఇంటి సభ్యుల అందరితో డ్యాన్స్‌లు చేయించాడు. లాస్యతో చపాతి స్టెప్పులు, అఖిల్‌తో వర్కవుట్ స్టెప్స్‌, అభితో కార్ డ్రైవింగ్ స్టెప్స్, సోహైల్‌తో ఫైటింగ్ స్టెప్పులు, అరియానాతో రెడ్ లవ్ స్టెప్పులు, రాజశేఖర్ మాస్టర్‌తో కాంచన స్టెప్పులు, కుమార్ సాయితో కన్ఫ్యూజన్ స్టెప్పులు, గంగవ్వతో నీ కన్ను నీలి సముద్రం పాటకు స్టెప్పులు వేయించాడు.
 
మార్నింగ్ మస్తీలో భాగంగా గంగవ్వ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అలానే కాలికి గాయమైన కూడా అవినాష్ కూర్చొని డ్యాన్స్ చేయడం ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచింది. డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత అవినాష్.. ప్రకాశ్ రాజ్ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ అందరిని ఆటపట్టించాడు. ఇంతలోనే అఖిల్‌ని కన్ఫెషన్‌ రూంలోకి రమ్మని ఆదేశించాడు.
 
తొలిసారి కన్ఫెషన్ రూంలోకి అడుగుపెట్టిన అఖిల్ ముందు మెనూ లిస్ట్ ఉంచి అందులో ఐటమ్స్‌ని తన దగ్గర ఉన్న పాయింట్స్ ఆధారంగా షాపింగ్ చేయాలని ఆదేశించారు. 16మందికి సరిపోయేలా లగ్జరీ బడ్జెట్ రూపొందించాలని బిగ్ బాస్ చెప్పడంతో అతను బోర్డ్ పైన ఐటమ్స్ రాశాడు. అయితే కొన్ని ఐటమ్స్ ఎవరికి ఉపయోగపడవని భావించిన అఖిల్ కొంత మందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ రాయగలిగాడు అఖిల్. అనంతరం బయటకు వచ్చిన అఖిల్‌తో లగ్జరీ బడ్జెట్ గురించి చర్చించగా, దానికి తగ్గ వివరణ ఇచ్చాడు.
 
కన్ఫ్యూజన్ అనే కారణంతో అందరికి టార్గెట్‌గా మారిన కుమార్ సాయి కెప్టెన్ టాస్క్‌లో విజేతగా నిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. వచ్చే వారం కెప్టెన్ బాధ్యతలను స్వీకరించనున్నాడు. అయితే శుక్రవారం ఎపిసోడ్‌లో కుమార్ సాయి కునుకు తీయడంతో కుక్కలు భౌ భౌ అంటూ అరిచాయి. దీంతో అతను నేను నిద్ర పోవడం లేదు, ధ్యానం చేస్తున్నా అని కవర్ చేసుకున్నాడు. అయినప్పటికీ సోహైల్, అవినాష్‌లు కుమార్‌ని కొద్ది సేపు ఆటపట్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments