Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 8వ సీజన్.. 100 రోజులు.. సెప్టెంబర్ 1న ప్రారంభం.. ఫైనల్ లిస్ట్ రెడీ

సెల్వి
మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:18 IST)
తెలుగు టీవీలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షో లోగోను మేకర్స్ విడుదల చేశారు. ఇక సెప్టెంబర్ 1న ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం వుంది. 
 
ఈ షో 100 రోజుల పాటు కొనసాగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్ వర్క్‌తో పాటు, బిగ్ బాస్ తెలుగు 8 ప్రోగ్రామ్ హెడ్‌లు హౌస్‌మేట్స్ కోసం ఆటలు, పోటీలు, ఈవెంట్‌లను ఖరారు చేస్తున్నారు. ఈ సీజన్‌కి సంబంధించిన ప్రోమో చిత్రీకరించబడింది. ఇది ఆగస్టు చివరి వారంలో విడుదల కానుంది. 
 
అలాగే బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ కంటెస్టెంట్ల పేర్లు కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 ఖరారు చేయబడిన పోటీదారుల కొత్త జాబితాలో నటి అంజలి పావని, యాంకర్ రీతు చౌదరి, సన, మై విలేజ్ షో యూట్యూబర్ అనిల్, హాస్యనటుడు యాదమ్మ రాజు ఉన్నారు. బంచిక్ బబ్లూ, కిర్రాక్ ఆర్‌పి, యాంకర్ వింధ్య, నటి గాయత్రి గుప్తా, ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ షో కోసం ఖరారు చేయబడిన పోటీదారులలో వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంకా న్యూస్ రీడర్ కళ్యాణి, రేఖ భోజ్, వారధి ఫామ్స్ నేత్ర, నటుడు ఇంద్రనీల్, గాయకుడు సాకేత్, దీపికా రంగనాథ్, శ్రీకర్, సయ్యద్ అభూ, ఊర్మిళా చౌహాన్‌లు కూడా బిగ్ బాస్ 8వ సీజన్‌లో పాల్గొనే అవకాశం వుంది. 
 
ఈ సీజన్‌కు సంబంధించిన పోటీదారుల ఎంపిక ఆగస్టు రెండో వారంలోపు పూర్తవుతుందని సమాచారం. దీనికి తోడు విష్ణుప్రియ భీమినేని, రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య, సాయి కిరణ్, ఖయ్యూమ్ వంటి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments