Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు చలన చిత్ర రంగంలో మహిళల యుగం రాబోతుంది !

Advertiesment
Nandamuri Tejaswini

డీవీ

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (09:48 IST)
Nandamuri Tejaswini
తెలుగు చిత్ర పరిశ్రమలో నవతరం నటీనటులకంటే సాంకేతిక వర్గంవైపు మగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు సినిమారంగంలో ప్రవేశిస్తున్నారు. ఒకప్పుడు వారసులుగా కొడులనే ఎంకరేంజ్ చేసే కాలం పోయింది. ఇప్పుడు కుమార్తెలను ఎంకరేజ్ చేసే తరుణం వచ్చేసింది. అయితే కథానాయికలుగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. మంచు లక్మీప్రసన్న, క్రిష్ణ కుమార్తె మంజుల, సుప్రియలు కూడా రాణించలేకపోయారు. అందుకే నిర్మాణరంగంలో ప్రవేశిస్తున్నారు. కథానాయికగా చేస్తే అభిమానులు ససేమిరా అంటున్నారు.

అందుకే దిల్ రాజు కూడా తన వారసులను నిర్మాణరంగంలో దింపారు. తొలి సక్సెస్ గా బలగం తెచ్చుకున్నారు. ఇక గుణశేఖర్ కుమార్తెలు కూడా నిర్మాణరంగంలో వున్నారు. అయితే జీవితరాజశేఖర్ కుమార్తెలు ఇరువురూ నాయికలుగా తమను తాము నిరూపించుకొనేందుకు శాయశక్తులా క్రిషి చేస్తున్నారు. దానితోపాటు తమ స్వంత బేనర్ లో నిర్మాతలుగా వ్యవహరించారు. 
 
ఇక ప్రస్తుతం నందమూరి బాలక్రిష్ణ వంతు వచ్చింది. ఒకేసారి కొడుకు మోక్షజ్నను హీరోగా పరిచయం చేయడంతోపాటు రెండో కుమార్తె తేజస్విని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. గతంలో బాలక్రిష్ణ నటించిన భగవత్ కేసరి సక్సెస్ మీట్ లో తేజస్విని మెరిసింది. తను నిర్మాణ రంగంలో ఆసక్తి వున్నట్లు తెలుస్తోంది.  కాగా, దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్ఝజ్నను లాంఛ్ చేసే అవకాశం ఇచ్చినట్లు సూచాయిగా బాలక్రిష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే నిర్మాతగా తేజస్విని కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై త్వరలో బాలక్రిష్ణ ప్రకటన చేయనున్నారు.
 
ఇప్పటికే పీపుల్స్ మీడియా, జీ టీవీ నుంచి వారి వారసులురాండ్రు కూడా నిర్మాతలుగా ప్రవేశించారు. ఇక ఆల్ రెడీ కొణిదెల నీహారిక నిర్మాతగా, నటిగా తన సత్తాను చాటుకుంటోంది. ఇదే కాకుండా ప్రముఖ బేనర్ లు నిర్మించే వెబ్ సిరీస్ లో మొత్తం మహిళలదే హవా కొనసాగుతుంది. దీనిపై దిల్ రాజు వ్యాఖ్యానిస్తూ, ఇప్పటి యువతీయువకుల ఆలోచనలు కథల ఎంపికలోనూ ఖర్చుల విషయాల్లో చాలా క్లారిటీగా వున్నారు. బలగం సినిమా చేసేటప్పుడు మా అన్న కూతురు మొత్తం వ్యవహాలను చూసుకుంది. నేను కొన్ని సజెషన్స్ చెప్పాను. కానీ తను ఆ తర్వాత చెప్పిన వివరణ సినిమాకు ఎంతో లాభించింది అని అన్నారు. సో. మహిళల యుగం రాబోతుందన్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిపోదా శనివారం నుంచి నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్