Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

Abhiram  Vennela

డీవీ

, సోమవారం, 17 జూన్ 2024 (18:13 IST)
Abhiram Vennela
లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం "ఇట్లు... మీ సినిమా". అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఇట్లు... మీ సినిమా" ఈనెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా  ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. 
 
webdunia
Itlu mee cinema triler event
అనంతరం దర్శకుడు హరీష్ చావా మాట్లాడుతూ - "ఇట్లు... మీ సినిమా" రూపొందించే క్రమంలో మొదటి నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు మా ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్ గారు. ఎలాంటి సినిమా చేయాలని మేము డిస్కస్ చేస్తున్నప్పుడు నాగ ప్రసాద్ గారే ఏ కథో ఎందుకు మన కథే తీద్దాం. మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పడిన ఇబ్బందులతోనే సినిమా చేద్దాం అని అన్నారు. ఇలాంటి సినిమా చేస్తే సినిమా పరిశ్రమలోకి వచ్చేవారికి అవగాహన ఏర్పర్చినట్లు అవుతుందని అన్నారు. ఆయన సలహాతోనే "ఇట్లు... మీ సినిమా" మూవీ ప్రారంభించాం. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మేము ఈ కథలో చూపించాం. ప్రేక్షకులందరికీ తప్పుకుండా నచ్చుతుంది. చిన్న సినిమా అని చూడకుండా థియేటర్స్ కు వెళ్లండి. మీ అందరూ అన్ని ఎమోషన్స్ ఉన్న "ఇట్లు... మీ సినిమా" మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన అతిథులు, మా స్నేహితులందరికీ థ్యాంక్స్. అన్నారు.
 
నిర్మాత నోరి నాగ ప్రసాద్ మాట్లాడుతూ,  "ఇట్లు... మీ సినిమా" మూవీతో ఒక మంచి ప్రయత్నం చేశాం. చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లు పడే ఇబ్బందులను ఆసక్తికరంగా ప్రేక్షకులకు నచ్చేలా చూపించాం. అన్ని ఎమోషన్స్ కలిపిన చిత్రమిది. ఈ నెల 21న "ఇట్లు... మీ సినిమా" మూవీని థియేటర్స్ లోకి గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటి మంజుల మాట్లాడుతూ - "ఇట్లు... మీ సినిమా" మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఎమోషనల్ గా నా పాత్ర సాగుతుంటుంది. మీరు ట్రైలర్ లో నా క్యారెక్టర్ చూసే ఉంటారు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు.
 
హీరోయిన్ వెన్నెల మాట్లాడుతూ - "ఇట్లు... మీ సినిమా" మూవీలో అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒక మంచి మూవీలో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. "ఇట్లు... మీ సినిమా" మూవీని థియేటర్స్ లో చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో అభిరామ్ మాట్లాడుతూ - "ఇట్లు... మీ సినిమా" మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్, దర్శకుడు హరీష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా తీస్తున్న టైమ్ కంటే ఇప్పుడు స్లిమ్ గా మారాను. ఈ సినిమాలో కొత్త నటీనటులు అని చూడకండి. కేవలం కంటెంట్ చూసి మా మూవీ చూసేందుకు రమ్మని కోరు తున్నా అన్నారు.
 
ఇంకా  నాగబాల సురేష్, రేలంగి నరసింహారావు, వీరశంకర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సముద్ర, టి.ప్రసన్నకుమార్, సాయివెంకట్ మాట్లాడుతూ.. ట్రైలర్, టీజర్ బాగున్నాయి. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం