Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ కు భలే ఉన్నాడే.. సెట్ అవుతుందా !

Raj Tarun   Manisha Kandkur

డీవీ

, శనివారం, 15 జూన్ 2024 (18:18 IST)
Raj Tarun Manisha Kandkur
రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైనఈ సినిమా ఫస్ట్, ఫస్ట్ సింగిల్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ భలే ఉన్నాడే సెకండ్ సింగిల్ సెట్ అవుతుందా పెయిరు సాంగ్ ని విడుదల చేశారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని మ్యాజికల్ మెలోడీగా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ప్లజెంట్ వోకల్స్ తో సాంగ్ కి మరింత ఫీల్ గుడ్ వైబ్ ని యాడ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఎట్రాక్టివ్, మీనింగ్ ఫుల్ గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ ని యూనిక్ గా ప్రజెంట్ చేసిన విధానం క్యురియాసిటీని పెంచింది.  
 
నగేష్ బానెల్లా ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్.
బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 
తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)