Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss Telugu 5: పోతూ పోతూ.. షణ్ముఖ్‌పై సరయు ఓపెన్ కామెంట్స్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:10 IST)
sarayu
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 సందడి మొదలైంది. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా నిన్నటితో ఈ షో ప్రారంభమై వారం రోజులు పూర్తయింది. ఇక ఇందులో ఎలిమినేషన్ రౌండ్‌లో మొత్తం ఆరుగురు ఎలిమినేట్ లీస్ట్‌లో ఉండగా అందులో నుండి బోల్డ్ బ్యూటీ సరయు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో సరయు ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్లు కనిపించింది. ఇక షణ్ముఖ్ జశ్వంత్‌పై ఓపెన్ కామెంట్స్ చేసింది.
 
యూట్యూబ్‌లో సెవెన్ ఆర్ట్స్ అనే వేదికగా బూతు మాటలతో వీడియోలు చేస్తూ బాగా హాట్ టాపిక్‌గా నిలిచింది సరయు. ఈమె వీడియోలను చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తుంటారు. నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారు. అయినా కూడా ఈ బోల్డ్ బ్యూటీ వాటిని పట్టించుకోకుండా మరింత బూతులతో రెచ్చిపోతుంది. మొత్తానికి ఈ బోల్డ్ బ్యూటీకి బిగ్ బాస్ లో అవకాశం రాగా అందులో తనేంటో నిరూపించుకోకపోగా మొదటి వారానికే ఇంటి పట్టు పట్టాల్సి వచ్చింది.
 
ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో మొత్తానికి ఎలిమినేట్ అయిన సరయు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై ఫైర్ అయ్యింది. ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అనే కాన్సెప్ట్‌లో ప్రతి ఒక్కరి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇక వరెస్ట్ ప్లేస్‌లో షణ్ముఖ్‌ను పెట్టి అతడి గురించి కొన్ని కామెంట్స్ చేసింది. నిజానికి తను హౌస్ లో ఉన్నంత కాలం షన్నుతో కూడా అంతగా మూవ్ అయినట్లు కనిపించలేదు. ఇక నిన్న మాత్రం షణ్ముఖ్‌పై బాగానే ఫైర్ అయినట్లు అనిపించింది.
 
అరేయ్ ఏంట్రా ఇది.. బయటే అనుకొని ఇలా రావొద్దురా.. ముందు ఆమెను లేపి.. అని అనడంతో వెంటనే సిరి సరయుకి గట్టిగా సమాధానమిచ్చింది. ఇక సరయు మాట్లాడుతున్న మాటలకు షణ్ముఖ్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన కూడా సరయు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లే అనిపించింది. 
 
ఇక వరస్ట్ ప్లేస్ పెట్టడంతో షణ్ముఖ్ ఏమి అనలేకపోయాడు. ఇక ఈ ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు, షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయు పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. షణ్ముఖ్ ను వరస్ట్ అనే ముందు నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావ్.. నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంటూ సరయు పై బాగానే ఆడుకున్నారు షన్ను అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments