Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్- గంగవ్వ చాడీల చిట్టానా?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (10:46 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మూడో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లిన స్వాతి.. ఒక్క వారానికే ఇంటి బాట పట్టింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్వాతిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేయగా.. ఆమె ఆటతీరు పెద్దగా బాలేదంటూ ప్రేక్షకులు కూడా వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో స్వాతి బయటకు వచ్చేసింది.
 
ఈ క్రమంలో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతిని స్టేజీపైకి పిలిచిన నాగార్జున, ఆమెతో ఆట ఆడించారు. ఈ క్రమంలో కార్డులపై కొన్ని లక్షణాలు రాసి.. ఆ లక్షణం హౌజ్‌లో ఏ వ్యక్తికి సెట్ అవుతుందో చెప్పి దానికి కారణం చెప్పాలని నాగార్జున సూచించారు.
 
ఈ సందర్భంగా కుమార్‌ సాయిని నక్కతోక తొక్కిన వ్యక్తిగా స్వాతి పేర్కొన్నారు. అతడు చాలా టాలెంటెడ్ అని, కానీ వెనుక నుంచి ఎవరైనా తోస్తే తప్ప తన టాలెంట్‌ని బయట పెట్టరని అన్నారు. ఇక అన్నం పెట్టిన అమ్మ రాజశేఖర్ మోసం చేశారని.. అతడు నమ్మకద్రోహి అని తెలిపారు.
 
ఇక సుజాతను పుకార్ల పుట్టగా, సోహైల్‌ని దొంగగా, లాస్యను అవకాశవాదిగా, నోయల్‌ను గుడ్డిగా నమ్మే వాడిగా, మోనాల్‌ని ఏమార్చే వ్యక్తిగా, మెహబూబ్‌ని అనుసరించే వ్యక్తిగా వెల్లడించారు. అలాగే అరియానా ఓవర్ కాన్ఫిడెన్స్ అని, హారిక ట్యూబ్‌లైట్ అని, అభిజిత్ అహంకారి అని, గంగవ్వ చాడీల చిట్టా అని, అఖిల్ గమ్యం లేని వ్యక్తి అని తెలిపారు.
 
కాగా హౌజ్‌లో అవినాష్ తన ఫేవరెట్‌ అని స్వాతి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన ఎలిమినేషన్‌కి కారణమైన అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ కెప్టెన్సీ రేసులో పాల్గొనడానికి వీలు లేదని అతడిపై స్వాతి బిగ్‌బాంబ్ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments