Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... మామూలోళ్లు కాదు.. అండర్ వరల్డ్‌తో రాగిణి - సంజనలకు లింకు!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (09:14 IST)
కన్నడ చిత్ర సీమలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీలు మామూలోళ్లు కాదని తెలుస్తోంది. ఇందుకంటే.. వీరిద్దరికీ అందర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్టు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో బట్టబయలైంది. 
 
కోర్టు అనుమతితో ఈ ఇద్దరు హీరోయిన్ల వద్ద బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఆ సమయంలో పలు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా వీరికి పలువురు రౌడీలు, అండర్ వరల్డ్ డాన్‌లతో సంబంధాలున్నాయని, ఆ దిశగా లింక్స్ లభించాయని సమాచారం. దీంతో కొందరు రౌడీలపైనా పోలీసులు నిఘా పెట్టారు.
 
ఇక విచారణలో సంజన పలుమార్లు విలపించిందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ని సినిమాలు చేశారు? ఎంత సంపాదించారు? తల్లిదండ్రుల నుంచి ఎంత ఆస్తి వచ్చింది? ఈ మధ్య కాలంలో ఏ ఆస్తులు కొన్నారు వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంజనపై సంధించారు. పలు భాషల్లో 42 సినిమాల్లో నటించిన సంజన, చిత్ర సీమలో పేరు తెచ్చుకోకున్నా, ఆదాయం విషయంలో మాత్రం చాలా మందికన్నా ముందుందని అధికారులు గుర్తించారు.
 
ఈ మొత్తం ఆస్తులు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని తేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖకు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఒకవేళ సంజనకు బెయిల్ లభించి బయటకు వచ్చినా, తదుపరి విచారణ కోసం మరోసారి అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు ఈ సినీ తారలు తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments