Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ నాలుగో సీజన్.. రోబోలు వర్సెస్ మనుషులు

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (12:24 IST)
బిగ్ బాస్ సీజన్ నాలుగో సీజన్ మరింత ఉత్కంఠగా మారుతోంది. రోజుకో కొత్త టాస్క్‌తో కంటిస్టెంట్స్‌ని పార్టిసిపేట్ చేయిస్తున్నారు. తాజాగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులను రోబోలు-మనుషులు అంటు రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ప్రేక్షకులకి మంచి వినోదం అందించారు. ఈ టాస్క్‌లో కొట్టుకోవడాలు కూడా చేసుకున్నారు.
 
ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఉక్కు హృదయం అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో రోబోలు వర్సెస్ మనుషులు ఉంటారు. రోబోలకి సంబంధించిన సిల్వర్ బాల్‌ని పగలగొడితే మనుషులు విజేతలుగా నిలుస్తారని చెప్పారు బిగ్ బాస్. మరోవైపు రోబోలు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేసుకోవాలని కూడా అన్నారు. గెలిచిన టీమ్ నుండి వచ్చే వారం ఒకరు కెప్టెన్‌గా ఎంపిక అవుతారంటూ స్పష్టం చేశారు బిగ్ బాస్.
 
16 మంది సభ్యులని రోబో.. మనుషుల టీం కింద డివైడ్ చేశారు. రోబో టీంలో అభిజిత్, దేవి, లాస్య, అవినాష్, కుమార్, గంగవ్వ, హారిక, అరియానాలు ఉండగా, మనుషుల టీంలో అఖిల్, మొనాల్, అమ్మా రాజశేఖర్, నోయల్, మొహబూబ్, దివి, సుజాత, సొహైల్‌లు ఉన్నారు.
 
చిన్నపాటి యుద్ధాన్ని తలపించిన ఈ టాస్క్‌లో గంగవ్వ కూడా ఉత్సాహంగా పాల్గొంది. బెల్ మోగగానే రోబోలకి చెందిన సిల్వర్ బాల్‌ని పగలగొట్టేందుకు మనుషుల టీమ్ గట్టిగానే ప్రయత్నించింది. రోబో టీంలో దేవికి సంబంధించిన బాల్ పగలగొట్టారు. అయితే రోబోలకు ఇంటి సదుపాయాలు వాడుకునే అవకాశం ఇవ్వగా, మనుషులు మాత్రం బయటే ఉండిపోయారు.
 
మనుషులు బయట ఉండటంతో ఫుడ్, వాష్ రూం తదితర సౌకర్యాలను వాడుకోవాలంటే రోబోలకు ఛార్జ్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే రోబోలకు చార్జ్ ఇవ్వడం ఇష్టం లేని మనుషులు వాష్ రూం వచ్చిన కూడా కొద్దిసేపు ఓపిక పట్టారు. ఈ విషయంలో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments