Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

కార్తీక దీపం సీరియల్ క్రేజ్ అది.. ప్రేమ విశ్వనాథ్ టీవీ కొనిపెట్టేసిందిగా..?

Advertiesment
Netizens
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (18:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే ఈ సీరియల్‌కు కోట్లాది అభిమానులన్నారు. రాత్రి ఏడున్నర అయిదంటే చాలా అన్ని ఇళ్లల్లో దీపక్క పలుకులు వినిపించాల్సిందే. ఈ సమయంలో ఇతర ఛానెళ్లలో పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా.. కార్తీక దీపం రేటింగ్‌ను మాత్రం క్రాస్ చేయలేవు.
 
అంతలా అందరికీ దగ్గరయ్యి.. బుల్లితెరపై రికార్డుల మోత మోగిస్తోంది. ఐతే కార్తీక దీపం అభిమానులకు ఇప్పుడు ఐపీఎల్ రూపంలో కొత్త కష్టం వచ్చిపడింది. కార్తీక దీపం సీరియల్ ప్రసారమయ్యే సమాయానికి ఐపీఎల్ కూడా వస్తుండంతో ఇంట్లో అప్పుడే రచ్చ మొదలయింది. ఈ సమస్యను ఇప్పటికే సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
ఇంకా ఐపీఎల్ వేళలను మార్చాలంటూ ఏకంగా సౌరవ్ గంగూలీకే విజ్ఞప్తి చేశాడు. ఆ ట్వీట్‌ను స్టార్‌ మాతో పాటు గంగూలీకి ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ట్విట్ పై ఆ సంబంధిత సీరియల్ ప్రసారం అవుతున్న చానెల్ స్పందిస్తూ... ''నిజమైన అభ్యర్థన లాగానే కనిపిస్తున్నది'' అని రిప్లై ఇచ్చింది. దాంతో ఈ ట్విట్ కాస్త వైరల్‌గా మారి... ఆ ట్విట్ కార్తీక దీపంలో లీడ్ రోల్ లో నటిస్తున్న దీప(ప్రేమి విశ్వనాథ్‌) కంట పడింది. 
 
ఒక సీరియల్‌ను ఇంతలా అభినందిస్తారా అంటూ ఐపీఎల్ టైమింగ్స్ మార్చడం కుదరని పని అని తెలుసుకున్న దీప తమ సీరియల్ అభిమాని ఇంట్లో గొడవలు రాకూడదని ఒక లెటర్‌తో పాటుగా 32 అంగుళాల టీవీని కొని శివచరణ్‌ ఇంటికి పంపించింది. ఇక ఆ ఇంట్లో గొడవ పడకుండా ఓ టీవీ లో కార్తీక దీపం మరో టీవీలో ఐపీఎల్‌లు మ్యాచ్‌లు చూడవచ్చు. అదన్నమాట సంగతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనమ్, మరోసారి నీ మొగుడి ముఖం చూడు, ఎలా వున్నాడో? నెటిజన్ ట్రోల్, సోనమ్ ఆగ్రహం