Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిఆర్‌పికి కేరాఫ్ అడ్రస్ ఈ బుల్లితెర జంట...బిగ్ బాస్-3కి ఒప్పుకుంటారా?

Webdunia
బుధవారం, 29 మే 2019 (18:38 IST)
వరుసగా రెండు సీజన్ల పాటు మంచి టిఆర్‌పితో సాగిన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్నందున హౌస్‌లో ఎంటర్ కాబోయే సెలబ్రేటీలు ఎవరనే విషయంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సీజన్‌ను ఇంకా బాగా రక్తి కట్టించాలనే ఉద్దేశ్యంతో జబర్దస్త్, ఢీ షోల ద్వారా పేరు పొందిన సుడిగాలి సుధీర్, రష్మిలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
 
జబర్దస్త్, ఢీ షోలతో సుధీర్, రష్మిల జోడీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇద్దరి మధ్య లవ్ ఉందనే ఎఫైర్ ఒకపక్క చక్కర్లు కొడుతుంటే మరోవైపు ఇది నిజమేమో అనిపించేలా ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఇతర సభ్యులు కూడా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే విధంగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. గతంలో ఓ సందర్భంలో నిర్వాహకులు వీరిద్దరికీ పెళ్లి కూడా చేశారు. 
 
వీరిద్దరూ ఉన్నారంటే సందడి, వినోదానికి కొరతే ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ జంట బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో ఉంటే ఖచ్చితంగా రేటింగ్స్‌కు రెక్కలు రావడం ఖాయం. అందుకే వీరిని ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట షో నిర్వాహకులు. అయితే ప్రస్తుతం వారిద్దరి కెరీర్ పీక్‌లో నడుస్తోంది. 
 
టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ 90 రోజుల పాటు సాగే బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకురావడం అంటే నిర్వాహకులు భారీ స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది, కనుక ఇది సాధ్యపడదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనలైజ్ చేసిన ఈ షోకి ఈ సారి నాగార్జున హోస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments