Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిబద్ధత లేని నూతన్ - సోమరిపోతు గణేష్ - పాంపరింగ్‌లో సామ్రాట్, మళ్లీ కౌషల్

'బిగ్ బాస్-2'లో నిన్నటి నామినేషన్ ప్రకారం పదిసార్లు బెల్ మోగుతుంది. బెల్ మోగిన ప్రతిసారి ఒక్కో హౌస్‌మేట్ మరో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి, వారిలో ఒకరిని సేవ్ చేసి, ఇద్దరిని నామినేట్

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:19 IST)
'బిగ్ బాస్-2'లో నిన్నటి నామినేషన్ ప్రకారం పదిసార్లు బెల్ మోగుతుంది. బెల్ మోగిన ప్రతిసారి ఒక్కో హౌస్‌మేట్ మరో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి, వారిలో ఒకరిని సేవ్ చేసి, ఇద్దరిని నామినేట్ చేయాలి, ఆయా కారణాలను కూడా వారి ముందే చెప్పాలి.
 
నూతన్, శ్యామల ఒకసారి ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు. బయటకు వచ్చినప్పుడు నూతన్ నాకు మరో మారు అవకాశం ఇస్తే వాళ్ళందరి అంతు చూస్తా అంటూ సోషల్ మీడియాలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం శ్యామల తనీష్‌తో చెప్పినట్లు నిన్న తేలిపోయింది. నిబద్ధత లేని కారణంగా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని తనీష్ చెప్పగా కన్నీరు పెట్టుకున్నారు నూతన్. ఇది చూసి తనీష్ కూడా కాస్త ఫీలయ్యాడు. 
 
ఇక కౌషల్ గణేశ్‌ను ఉద్దేశించి నీలాంటి సోమరిపోతులకు బిగ్ బాస్‌లో ఆస్కారం లేదు. అందుకే నిన్ను నామినేట్ చేశా. అసలు నీకు బ్యాటరీలు తీసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి. ప్రతివారం నామినేషన్స్ నుండి బయటపడటంతో నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందని చెప్పగా గణేష్ కూడా కౌషల్‌తో తీవ్ర వాగ్వివాదానికి దిగాడు.
 
ఇక పాంపరింగ్ ఎక్కువైపోయిందనే కారణంతో సామ్రాట్‌ను నామినేట్ చేయగా ఈ ప్రక్రియ తర్వాత చాలా అప్‌సెట్‌గా కనిపించాడు. హౌస్‌లో తీవ్రత నానాటికీ పెరిగిపోతున్నందున ఏమి జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments