Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నామినేషన్స్ పొగ మళ్లీ రాజుకుంది... లగ్జరీ బడ్జెట్ టాస్క్ అసంతృప్తి

బిగ్ బాస్ హౌస్‌లో నిత్యం ఏదో ఒక గొడవ, వాగ్వివాదం జరుగుతూనే ఉంది. వారాంతంలో నాని వచ్చి గొడవలపై వివరణ కోరి, వారికి క్లారిటీ ఇచ్చి సద్దుమణిగేలా చూస్తున్నాడు. అప్పటికి వారు కాంప్రమైజ్ అయ్యి కలిసిపోయినట్లు

నామినేషన్స్ పొగ మళ్లీ రాజుకుంది... లగ్జరీ బడ్జెట్ టాస్క్ అసంతృప్తి
, మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:11 IST)
బిగ్ బాస్ హౌస్‌లో నిత్యం ఏదో ఒక గొడవ, వాగ్వివాదం జరుగుతూనే ఉంది. వారాంతంలో నాని వచ్చి గొడవలపై వివరణ కోరి, వారికి క్లారిటీ ఇచ్చి సద్దుమణిగేలా చూస్తున్నాడు. అప్పటికి వారు కాంప్రమైజ్ అయ్యి కలిసిపోయినట్లు కనిపించినప్పటికీ బిగ్ బాస్ టాస్క్‌లు, నామినేషన్స్ పుణ్యమాని మళ్లీ వారి మధ్య చిచ్చు రాజుకుంటోంది.


తాజాగా నిన్న జరిగిన ఈ వారం ఎలిమినేషన్స్ ఇందుకు ఉదాహరణ. ఈసారి ఒక్కో సభ్యుడు ఇద్దరు హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేసి, ఒకరిని కాపాడి అందుకు కారణాలను వారి ముఖంపైనే చెప్పాలి. ఆ ప్రక్రియలో కొంతమంది కన్నీటి పర్యంతమవగా... మరికొందరు గొడవలకు దిగారు. నూతన్ నాయుడు: అమిత్, సామ్రాట్‌లను నామినేట్‌‌‌ని చేసి కౌశల‌్‌ను సేవ్ చేశాడు. 
 
శ్యామల: గణేశ్, నూతన్ నాయుడు‌లను నామినేట్ చేసి తనీశ్‌ని సేవ్ చేసింది. 
దీప్తి నల్లమోతు: సామ్రాట్, అమిత్‌లను నామినేట్ చేసి రోల్ రైడాని సేవ్ చేసింది. 
అమిత్: నూతన్ నాయుడు, గణేశ్‌లను నామినేట్ చేసి కౌశల్‌ని సేవ్ చేశాడు. 
గీతా మాధురి: నూతన్ నాయుడు, కౌశల్‌ని నామినేట్ చేసి అమిత్‌ని సేవ్ చేసింది. 
సామ్రాట్: కౌశల్, నూతన్ నాయుడులను నామినేట్ చేసి శ్యామలను సేవ్ చేశాడు. 
తనీశ్: కౌశల్, నూతన్ నాయుడులను నామినేట్ చేసి రోల్‌రైడాని సేవ్ చేశాడు. 
రోల్ రైడా: నూతన్ నాయుడు, కౌశల్‌ని నామినేట్ చేసి గణేశ్‌ని సేవ్ చేశాడు. 
కౌశల్: గణేశ్, సామ్రాట్‌లను నామినేట్ చేసి, అమిత్‌ను సేవ్ చేశాడు. 
గణేశ్: అమిత్, కౌశల్‌లను నామినేట్ చేసి గీతా మాధురి‌ని సేవ్ చేశాడు. నామినేషన్స్ ముగిసే సమయానికి కౌశల్, నూతన్ నాయుడు, గణేశ్, సామ్రాట్, అమిత్‌లు ఈ వారం నామినేషన్స్‌లో నిలిచారు. 
 
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా క్విడ్ కారు ఫీచర్స్ గురించి చెబుతూ దానికి సంబంధంగా టాస్క్ ఇచ్చారు. రెండు జట్లుగా విడిపోయి ఒక్కో జట్టు బజర్ మోగగానే కారు కింద ఉన్న తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేసి, బూట్ స్పేస్ ఓపెన్ చేసి అందులో లగేజీ సూట్‌కేసు ఉంచాక, అందరూ లోపల కూర్చుని రివర్స్‌లో లైన్ వరకు నడపాలి. ముందుగా అమిత్ టీమ్ పాల్గొని ముగించారు. ఆ తర్వాత కౌషల్ టీమ్ అంతకంటే తక్కువ టైమ్‌లో టాస్క్ పూర్తి చేసినప్పటికీ రూల్స్ ఫాలో కాలేదని చెప్పి అమిత్ టీమ్‌ను విజేతలుగా ప్రకటించారు సంచాలకులుగా వ్యవహరించిన దీప్తి నల్లమోతు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నానా? రాశిఖన్నా ఆన్సర్ ఏంటి?