Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌లో రికార్డింగ్ డాన్సులు... వీక్షకుల ఓర్పుకు పరీక్ష

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు "టాలీవుడ్ మారథాన్" అనే టాస్క్ ఇచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం ఎపిసోడ్ అంతా సూపర్ హిట్ పాటలతో, హోరెత్తించే డ్యాన్సులతో సరదాగా గడిచిపోయింది. ఇందుకోసం ఇంట్లోనే

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (10:15 IST)
నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు "టాలీవుడ్ మారథాన్" అనే టాస్క్ ఇచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం ఎపిసోడ్ అంతా సూపర్ హిట్ పాటలతో, హోరెత్తించే డ్యాన్సులతో సరదాగా గడిచిపోయింది. ఇందుకోసం ఇంట్లోనే డ్యాన్సింగ్ ఫ్లోర్, రంగురంగుల లైట్లు, సంగీతం, కాస్ట్యూమ్స్ ఏర్పాటు చేసాడు బిగ్ బాస్.
 
ఒక్కో కంటెస్టెంట్‌కు విడిగా, అబ్బాయిలకు ఒకటి, అమ్మాయిలకు ఒకటి, అందరికీ కలిపి ఒకటి చొప్పున పాటలను కేటాయించారు. ఆయా పాట వచ్చినప్పుడు సభ్యులు ఏ పనిలో ఉన్నా, వెంటనే డ్యాన్స్ ఫ్లోర్‌కి వచ్చి డ్యాన్స్ చేయాలి. సభ్యులందరూ ఈ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే బిగ్‌బాస్‌ హౌస్‌ సినిమా సాంగ్స్‌తో మంగళవారం హోరెత్తిపోయింది. 
 
టాలీవుడ్‌లో గత ఏడాదికాలంగా వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లోని సాంగ్స్‌ను కంటెస్టెంట్స్‌కి కేటాయించారు బిగ్‌బాస్. ఆ పాట ప్లే అవుతున్న సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లోర్‌పైకి వచ్చి డ్యాన్స్ చేయాలని ఆదేశించాడు. ఈ ‘టాలీవుడ్ మారథాన్’ టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేస్తే లగ్జరీ బడ్జెట్ వస్తుందని చెప్పాడు.
 
మొదట సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు మొదలుపెట్టినప్పటికీ మళ్లీ మళ్లీ రిపీట్ చేయడంతో కొత్త స్టెప్పుల కోసం వెతుక్కోలేక, అంతే జోష్‌తో డ్యాన్స్ చేయలేక నీరసించిపోయారు. వారు పర్ఫార్మెన్స్‌లు చూడలేక వీక్షకులు కూడా బోర్ ఫీలయ్యారు. ఇక ఇవాల్టి ఎపిసోడ్‌లో కూడా ఈ టాస్క్ కొనసాగనుందని ప్రోమో చూస్తే తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments