Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గంగవ్వ.. నొప్పికి పెద్దగా కేకలు (Video)

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:59 IST)
Gangavva
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ సందర్భంగా నొప్పిని తట్టుకోలేక ఆమె గట్టిగా అరిచారు. దీంతో వైద్య సిబ్బంది గంగవ్వ మొదటిసారిగా ఇంజెక్షన్ వేయించుకుందా అన్నట్లు షాకై చూశారు. కాగా మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమెకు టీకా ఇచ్చారు. వీడియోను మై విలేజ్ షో టీమ్.. గంగవ్వ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
గంగవ్వ కోవిడ్ వ్యాక్సిన్ రియాక్షన్ పేరిట వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయ్యో.. గంగవ్వ ఎప్పుడూ ఇంజెక్షన్ తీసుకోలేదా? ఎందుకంత భయం? అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరేమో ఆమె పెదవులకు, చర్మానికి ఏమైంది? పెదవులెందుకు తెల్లగా పాలిపోయాయి? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.
 
కాగా.. గంగవ్వ జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత లక్షణాలు ఇలాగే ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు.
 
గంగవ్వ… తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ గంగవ్వ అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్యక్రమంతో పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో ఆమెకు మరింత ఆదరణ దక్కింది. రీసెంట్‌గా వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగార్జునతో కలిసి ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు గంగవ్వ.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments