Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్ ఇంటికి వచ్చిన గంగవ్వ.. ఎందుకో తెలుసా?

అఖిల్ ఇంటికి వచ్చిన గంగవ్వ.. ఎందుకో తెలుసా?
, మంగళవారం, 23 మార్చి 2021 (20:49 IST)
బిగ్ బాస్ పార్టిసిపేట్ గంగవ్వ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ ఛానల్‌తో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్-4లో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. 
 
అయితే హౌస్‌లో అడుగు పెట్టిన కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేసింది. కాగా అదే హౌస్‌లో ఉన్న అఖిల్‌పై ఎనలేని ప్రేమాభిమానాలు చూపిస్తూ అతనిని దత్తత తీసుకుంటానని. అఖిల్‌కు పెళ్లి కూడా చేస్తానని చెప్పేది.
 
అయితే తాజాగా గంగవ్వ అఖిల్ ఇంటికి వచ్చారు. అఖిల్ కొన్న కొత్త కారుని గంగ ఇంటికి పంపించి మరి పిలిపించుకున్నారు. అఖిల్ ఇంటికి వచ్చిన గంగవ్వ అఖిల్‌ను తన ఇంటికి తీసుకుపోతానని ఆయన అమ్మానాన్నలు అన్నా వదినలను అడిగి తీసుకుపోతానని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాపారవేత్తను పెళ్ళాడిన సంజన గల్రాని..!