Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విని శ్రీ ఇన్‌స్టా పోస్ట్.. ఆ రాత్రి అది జరిగింది.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (13:14 IST)
Ashwini Sree
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సీజన్-7 అన్నింటికంటే బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా అభిమానుల మధ్య గొడవ జరిగే స్థాయికి హీట్ పెంచింది. గ్రాండ్ ఫినాలే రోజున పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డను విజేతగా ప్రకటించిన తర్వాత అసలు సినిమా మొదలైంది.
 
ప్రశాంత్‌ను చూసేందుకు ఇప్పటికే వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు గుమిగూడారు. అమర్‌దీప్‌ అభిమానులు కూడా ఉన్నారు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ ఫినాలే ముగించుకుని వెళ్లిపోతుంటే గొడవ మొదలైంది.
 
ప్రతి కంటెస్టెంట్‌ను బయటకు వెళ్లడానికి కూడా మార్గం లేకుండా కారులో చుట్టుముట్టారు. దారిలో వారి వాహనాలపై దాడి చేశారు. రన్నర్ అమర్‌దీప్ కారుపై దాడికి పాల్పడిన దృశ్యాలు, ఆయన తిట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
 
అయితే తాజాగా మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని శ్రీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించవచ్చు. 
 
ఈ వీడియోలో అశ్విని కారు నడుపుతూ స్టూడియో నుంచి బయటకు వెళ్లింది. ఇంతలో ఆయన కారును చుట్టుముట్టిన అభిమానుల గుంపులు కేకలు వేస్తూ వాహనంపై పడ్డారు. అయితే ఓ బాలుడు ఏకంగా కారు డోర్ తెరిచి అశ్వినిని బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. అశ్విని గట్టిగా అరుస్తూ తలుపు వేసింది. 
 
అయితే ఆ క్షణంలో అశ్విని పడిపోతే ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఈ షాకింగ్ వీడియోను అశ్విని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అదే ఆ రాత్రి జరిగింది అంటూ క్యాప్షన్ పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments