కనీసం గుడ్డును కూడా కాపాడుకోలేవా...? వితిక కామెంట్‌తో షాకైన వరుణ్

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (15:37 IST)
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ఇప్పటివరకు విజయవంతంగా 23 ఎపిసోడ్‌‌లను పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌‌కి ఏకంగా ఏడుగురు నామినేట్ కావడంతో మిగిలిన ఎపిసోడ్‌లు రసవత్తరంగా ఉండనున్నాయి.
 
టాస్కుల పేరుతో గొడవపడే అవకాశాన్ని ఇస్తున్నట్లు విక్రమపురి, సింహపురి అని రెండు రాజ్యాలుగా విడగొట్టి గుడ్ల కోసం, జెండాల కోసం దెబ్బలాడుకోమన్నాడు బిగ్ బాస్. రెడ్ టీంకి శ్రీముఖి లీడర్‌గా పెట్టగా, బ్లూ టీంకి హిమజను లీడర్‌గా పెట్టి రెండు టీంలుగా విడగొట్టారు.

ఇక రెండు రాజ్యాలకు బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలని.. ఇక గేమ్‌లో ఉన్న గుడ్లను సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందంటూ గేమ్ మొదలు పెట్టించారు బిగ్ బాస్. 
 
ఈ ఫిజికల్ గేమ్‌లో జెండాల కోసం, గుడ్లు కోసం ఒకరిపై ఒకరు పడుతూ లాక్కుంటూ పీక్కుంటూ కొట్టుకుంటూ ఆడ మగ తేడా లేకుండా రెచ్చిపోయారు హౌస్‌మేట్స్. బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించకూడదు, ఆస్తికి, మనుషులకు హాని కలిగించకూడదంటూ హితవు పలుకుతూనే ఇలాంటి గేమ్స్ ఇస్తుంటాడు బిగ్ బాస్.

ఇక ఈ గేమ్‌లో వరుణ్‌ దగ్గర నుండి సాఫ్ట్ గేమ్‌ ఆడి ఒక హౌస్‌మేట్ ఈజీగా గుడ్డును దొంగిలించాడు. దీంతో నువ్.. పెద్ద ఫ్రూట్‌వి గుడ్డు కూడా కాపాడుకోలేకపోయావు అంటూ ఛలోక్తి విసిరింది వరుణ్ భార్య వితికా షెరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments