వరలక్ష్మిపై విమల్ కామెంట్స్.. మగాడిగా అభివర్ణించి.. కవర్ చేశాడు..

బుధవారం, 14 ఆగస్టు 2019 (12:40 IST)
తమిళ హీరో విమల్ వివాదంలో చిక్కుకున్నాడు. తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్‌పై విమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. వరలక్ష్మిని మగాడిగా అభివర్ణించిన విమల్ ఆపై ఎంతగా సమర్థించుకున్నా.. వివాదం నుంచి బయటపడలేని పరిస్థితి. అలాగే తన కామెంట్స్‌ను మళ్లీ కవర్ చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. 
 
విమల్, వరలక్ష్మి శరత్ కుమార్ ''కన్నిరాశి'' సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విమల్ నోరు జారాడు. సినిమాల్లో తాను తొలిసారి ఓ మగాడికి జోడిగా నటిస్తున్నానని వరలక్ష్మిని ఉద్దేశించి అన్నాడు. 
 
అంటే, తన ఉద్దేశం.. వరలక్ష్మితో కలిసి పనిచేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పడమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే వరలక్ష్మిని మగాడిగా అభివర్ణించడంతో విమల్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జబర్దస్త్ కామెడీ షోకి బైబై చెప్పనున్న ఎమ్మెల్యే రోజా?