Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఉత్పత్తులను వాడాలని లేదు.. బీబీ2 ఫోన్‌ను నేలకేసి కొట్టాడు..?

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (15:03 IST)
భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఘటనల కారణంగా చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. సరిహద్దుల ఘర్షణల కారణంగా భారత్‌కు చెందిన 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించారని అంటున్నారు. ఈ ఘటనల వలన చైనా పట్ల భారత ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా చైనా వస్తువుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు బిగ్ బాస్‌లో పార్టిసిపేషన్ చేస్తున్న సమయంలో గెలుచుకున్న ఒప్పో మొబైల్ ఫోన్‌ను నేలకేసి కొట్టాడు కౌశల్. 
 
తన ఇంట్లో బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అంటూ గట్టిగా కిందకి విసిరేశాడు. దీంతో ఆ మొబైల్ ఫోన్ కాస్తా ముక్కలు ముక్కలు అయింది. వెంటనే దాన్ని తీసుకుని డస్ట్ బిన్‌లో వేసేశాడు కౌశల్. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
 
తాను చైనా ప్రోడక్ట్స్‌ను వాడాలని అనుకోవడం లేదన్నదానికి సాక్ష్యం ఈ వీడియో అంటూ తన అకౌంట్ లో షేర్ చేశాడు కౌశల్. దీనిపై పలువురు సానుకూలంగా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments