Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 2 : ఎపిసోడ్ 101 హైలైట్స్

బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. ఏ టాస్క్ ఇచ్చినా సరే అందరూ గెలవాలనే కసితో ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 'మీ ఇసుక జాగ్రత్త' అనే ఫిజికల్ టాస

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:58 IST)
బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. ఏ టాస్క్ ఇచ్చినా సరే అందరూ గెలవాలనే కసితో ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 'మీ ఇసుక జాగ్రత్త' అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో గెలిపొందిన విజేతకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఇవ్వడంతోపాటు నేరుగా ఫినాలేకి వెళ్లే అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ 2 లెవల్స్ ఉంటుంది. మొదటి లెవల్‌లో కౌశల్, గీతా, రోల్ రైడా ఇసుకనుకాపాడుకుంటూ ఉంటే, మిగిలిన వాళ్లు ఆ ఇసుకని పడేసే ప్రయత్నం చేయాలి. కిందపడిన ఇసుకను మళ్లీ తీసుకోవచ్చు.
 
తమ ఇసుకను కాపాడుకుంటూ మిగిలిన వాళ్ల ఇసుకను కింద పడేయొచ్చు. ముందుగా రోల్ రైడా ఇసుకను కిందపడేసిన తనీష్, తర్వాత సామ్రాట్‌తో కలిసి రోల్ రైడాను గెలిపించాలని నిర్ణయించుకుని కౌషల్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తోసుకోవడంతో మొదలై కొట్టుకునే వరకూ వెళ్లింది. తనీష్, కౌశల్‌లు తమ బలాబలాలను ప్రదర్శించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధంకావడంతో బిగ్ బాస్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.
 
బిగ్ బాస్ సీజన్ 2లో ప్రారంభం నుంచి ఎక్కువగా ఫిజికల్ టాస్క్‌లే ఇస్తూ వస్తున్నారు బిగ్ బాస్.. ఇక ఇప్పుడు కూడా 'మీ ఇసుక జాగ్రత్త' అనే ఈ ఫిజికల్ టాస్క్‌లో భాగంగా అద్దాలతో ఉన్న పెద్ద బాక్స్‌లో ఇసుకను కాపాడుకోవడం.. మిగిలిన వాళ్ల ఇసుకను కింద పడేయడం లాంటి ఫిజికల్ టాస్కే ఇచ్చారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కౌశల్, తనీష్‌లు శారీరక దాడులకు పాల్పడటం ఆపకపోవడంతో బిగ్ బాస్ హెచ్చరించి.. చివరి అవకాశం ఇచ్చారు. ఇక రోల్ రైడాను 'మీ ఇసుక జాగ్రత్త' లెవల్ టుకి వెళ్లిన మొదటి పోటీదారుడిగా ప్రకటించారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో దీన్ని తలదన్నే విధంగా గొడవలు జరుగుతున్నట్లు ప్రోమోలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments