Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవ‌దాస్ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అ

Advertiesment
దేవ‌దాస్ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (19:12 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ్ దేవ పాత్ర‌లో డాన్‌గా న‌టిస్తే... నాని దాస్ పాత్ర‌లో డాక్ట‌రుగా న‌టిస్తున్నారు. ఇక నాగ్ స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ న‌టిస్తే.. నాని స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించింది.
 
స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆడియోను అక్కినేని జ‌యంతి రోజున గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన పాట‌ల‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి..నాగ్ - నాని ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాటల పల్లవిలను ట్రోల్ చేస్తూ ఎక్కడికో తీస్కెళ్తున్నారు...