Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌ -13 హోస్ట్ సల్మాన్‌కు పారితోషికం ఎంతో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:49 IST)
కేవలం ఒక్క రియాలిటీ షోకి రూ.400 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరో మీకు తెలుసా? ఇది కేవలం కొన్ని వారాల పాటు సాగే షో. ఆ మాత్రం దానికే అతడికి ఏకంగా రూ.400 కోట్ల పారితోషికం ముడుతోంది. ఊహకైనా అందని పారితోషికం ఇది. ఇంతకీ అందుకుంటున్నది ఎవరు అంటే ది గ్రేట్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్. అతడు హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ హిందీ సీజన్ 13 కోసం ఇంత పెద్ద మొత్తం ముడుతోంది. ఒక్కో ఎపిసోడ్‌కి 31 కోట్లు చొప్పున మొత్తం ఎపిసోడ్లకు అతడు రూ.400 కోట్లు అందుకుంటున్నాడన్నది తాజా సెన్సేషన్. 
 
కేవలం హోస్టింగ్ చేసినందుకే ఇంత పెద్ద మొత్తం సల్మాన్ ఖాన్ అందుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్ 26 ఎపిసోడ్ల కోసం అంటే 26 వారాల పాటు తన సినీ షూటింగ్ సమయాన్ని సల్మాన్ ఖాన్ వెచ్చించాల్సి ఉంటుంది. అయితే అంత పెద్ద మొత్తం అందుకునేందుకు అతడికి మాత్రమే అర్హత ఉందన్నది అభిమానులు చెబుతున్న మాట. బిగ్ బాస్‌ని ఇప్పటికే ఎంతో విజయవంతంగా నడిపించిన హోస్ట్‌గా సల్మాన్ పేరు మార్మోగిపోతోంది. 
 
అతడు హోస్ట్ అనగానే ప్రపంచవ్యాప్తంగా టీఆర్‌పీ అదురుతుంది. దేశవ్యాప్తంగా గొప్ప ఆదరణ ఉన్న షోగా బిగ్ బాస్‌ని మలచడంలో భాయ్ పెద్ద సక్సెస్ అయ్యాడు. ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో రెవెన్యూ అందుకుంటున్న ఏకైక భారతీయ హీరో సల్మాన్ ఖాన్ అనడంలో సందేహమే లేదు. ఇక సల్మాన్ భాయ్ స్థానంలో వేరొక హోస్ట్‌ని ఎంపిక చేసేందుకు కలర్స్ బృందం ప్రయత్నించినా అది వీలుపడలేదు. బిగ్ బాస్ 13 సీజన్ కోసం జే భానుషాలి, మహి విజ్, వివేక్ దాహియా లాంటి హేమాహేమీల పేర్లు పార్టిసిపెంట్స్ జాబితాలో వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments