టాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కఠిన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఇకపై నటించబోనని ప్రకటించింది. ఈ అమ్మడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ - దిశా పటానీలు కలిసి నటించిన చిత్రం "భరత్". ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రాను ఎంపికచేశారు. కానీ ఆమె అనివార్య కారణాల రీత్యా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కత్రినా, దిశా పటానీలు హీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, సల్మాన్ సరసన నటించడంపై దిశా పటానీ స్పందిస్తూ, సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేయబోనని స్పష్టం చేసిందట. అసలు కారణం ఏంటి అనేది తెలియదుగానీ.. సల్మాన్ పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని.. అందుకే ఇకపై సల్మాన్‌తో కలిసి పని చేయనని చెప్పుకొచ్చింది.