Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశల్ కన్నింగ్... వాళ్లిద్దర్లో ఒకరు గెలిస్తే నాకు హ్యాపీ... బిగ్ బాస్ ఇంట్లో ఏదైనా జరగొచ్చు...

ఎంతో కీలకమైన హౌస్‌మేట్స్ పోటీపడిన ఈ వారం ఎలిమినేషన్‌లో వేటు అమిత్‌పై పడింది. మొత్తం ఈ వారం నామినేషన్‌లో దీప్తి, గీతా, కౌశల్, అమిత్, రోల్‌లు అయిదుగురు ఉండగా మొదటిగా సేఫ్ అయ్యింది దీప్తి, ఇక సేఫ్ అయిన రెండో హౌస్‌మేట్ కౌషల్, మూడోవారుగా గీతా, నాలుగో హౌస్

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (20:29 IST)
ఎంతో కీలకమైన హౌస్‌మేట్స్ పోటీపడిన ఈ వారం ఎలిమినేషన్‌లో వేటు అమిత్‌పై పడింది. మొత్తం ఈ వారం నామినేషన్‌లో దీప్తి, గీతా, కౌశల్, అమిత్, రోల్‌లు అయిదుగురు ఉండగా మొదటిగా సేఫ్ అయ్యింది దీప్తి, ఇక సేఫ్ అయిన రెండో హౌస్‌మేట్ కౌషల్, మూడోవారుగా గీతా, నాలుగో హౌస్‌మేట్‌గా రోల్ సేఫ్ అయ్యాక, ఫైనల్‌గా ఎలిమినేషన్ కత్తి అమిత్‌పై పడింది.
 
ఇక బ్యాగ్ సర్దుకుని అందరికీ సెండాఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసాక నాని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మీ దృష్టిలో ఫైనల్‌కు వెళ్లే అర్హత ఎవరెవరికి ఉందని అడుగగా తనకు తెలిసినంతవరకు రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురిలు టాప్ 3లో ఉంటారని అభిప్రాయపడుతున్నాని అన్నారు. గీతా మాధురికి మంచి సెన్స్ ఉందని.. చాలా మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతుందని, ఇక సామ్రాట్ విషయానికొస్తే అతనో మిస్టర్ పర్‌ఫెక్ట్ అన్నారు. 
 
బిగ్ బాస్ టైటిల్ రోల్ రైడా, సామ్రాట్‌‌లు గెలిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కౌశల్‌ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడన్నారు. ఆయనలో కన్నింగ్ లక్షణాలు ఉన్నాయన్నారు. చివరిలో ఎలిమినేట్ అయిన వ్యక్తికి హౌస్‌లో ఒకరిపై బిగ్ బాంబ్ విసిరే అవకాశం బిగ్ బాస్ కల్పిస్తున్నారనే విషయం తెలిసిందే.
 
ఈ వారం బిగ్ బాంబ్ ఏమిటంటే బిగ్ బాంబ్ పడబోయే హౌస్‌మేట్ ఈ వారం మొత్తం అందరి హౌస్‌మేట్స్ జుట్టు దువ్వాల్సి ఉంటుంది, వారెవరూ దువ్వుకోకూడదు. మరి ఏమనుకున్నాడో ఏమో అమిత్ ఈ బిగ్ బాంబ్‌ను దీప్తి నల్లమోతుపై వేసాడు. ఇక ఈ వారం మొత్తం అందరి జుట్టు దీప్తి చేతిలోనే అన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments