Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ దర్శకత్వంతో బిచ్చగాడు 2 సిద్ధమవుతోంది

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (15:49 IST)
Bicchagadu 2 poster
విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా "బిచ్చగాడు".  ఈ సినిమా సీక్వెల్ గా "బిచ్చగాడు 2" రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. 
 
గతంలో విడుదలైన ఈ సినిమా థీమ్ సాంగ్ వినూత్నంగా ఉండి ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం ప్రకటన చేసింది. బిచ్చగాడు 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.
 
దేవ్ గిల్,  హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత - ఫాతిమా విజయ్ ఆంటోనీ, బ్యానర్ - విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం,ఎడిటింగ్, దర్శకత్వం - విజయ్ ఆంటోనీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments