Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళాశంకర్‌కు ఫెయిల్‌కు కారణం చిరంజీవే!

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (11:35 IST)
Chiranjeevi
చిరంజీవికి భోళాశంకర్‌ ఫెయిల్‌కు కారణం ప్రధానంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సెట్‌కాలేదు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. దీని గురించి ప్రముఖ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ సంచలన నిర్ణయాలు వెల్లడించారు. శ్రీముఖి పాత్ర కూడా సరిగ్గాలేదు. ఇలా చాలా అంశాలను టచ్‌ చేశారు.
 
మామిడాల తిరుపతి డైలాగ్‌లు రాశారు. అనిల్‌ సుంకర, కె.ఎస్‌. రామారావు నిర్మాతలు. కీర్తి సురేష్‌, తమన్నా, చిరంజీవి ప్రధాన తారాగణం. ఆర్టిస్టులు చాలామంది వున్నారు. కానీ చిరంజీవి మొత్తం క్యాప్సర్‌ చేశారు. జబర్ద్‌దస్త్‌ నటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇది కేవలం అన్నా చెల్లెలు కథ. చెల్లికాని చెల్లిని అన్న స్వీకరించిన కథ. తనకు ప్రాణం పోసిన అమ్మాయిని చెల్లెగా చూసుకున్నాడు. వేదాళంలో ఆ కథ తమిళంలో ఎక్కింది. 
 
ఇక చిరంజీవి వరుసగా చాలా హత్యలు చేస్తాడు. అన్ని హత్యలు చేసినవాడు అరెస్ట్‌ అవ్వాలి. అది రూల్‌, కానీ ఇందులో అలా జరగదు. ఎందుకనో చివరిలో ఓ డైలాగ్‌ చిరంజీవి చెబుతాడు. నేపథ్యసంగీతం డామినేట్‌ చేసింది. దాంతో చిరంజీవి ఎవరు? ప్రబుత్వం ఆయన్ను హత్యలుకోసం నియమించిందా? అనేది నాకైతే అర్థంకాలేదు.
 
ఇక కొల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌ కూడా చాలా మైనస్‌. ఇది మన తెలుగు కథకాదు అని ప్రేక్షకులు భావించారు. ఇక అన్నాచెల్లెలు కథ కూడా సరిగ్గా సెట్‌ కాలేదు. ఫస్టాఫ్‌లో హత్యలు చేసి సెకండాఫ్‌లో కథ చెబితే ఎందుకు చంపుతున్నాడో తెలీక ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్‌లో వుంటాడు.  ఖైదీ సినిమాలో కథను ముందుగానే చెప్పేసి ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని చూపించడంతో జనానికి నచ్చింది. కనుక హత్యలు ముందుగా చేస్తే అందుకు కారణాన్ని ముందుగా తెలపాలి. కానీ ఇప్పటి ట్రెండ్‌ ట్విస్ట్‌లు అంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కరెక్ట్‌ కాదు. 
 
మరోవైపు తమన్నా పాత్ర సరిగ్గా చూస్తే కనెక్ట్‌కాలేదు. మెగాస్టార్‌ను అవమానించాలనుకోవడం అనే  అంశం కూడా చాలా ప్రమాదమైంది. ఆవిడకు చివరల్లో ప్లాష్‌ బ్యాక్‌ చెబుతాడు. విడుదలకు ముందే చిరంజీవి జాగ్రత్తగా చూశాడోలేదో తెలీదు. ఇకనైనా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని సూచిందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

దేవాన్ష్ ప్రపంచ రికార్డు : మనవడిపై సీఎం బాబు ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments