Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాభై ఏళ్ళు గా హీరోలకు గురువైన వైజాగ్ సత్యానంద్

Advertiesment
chiru-sathyanadh-pawn-nagababu
, గురువారం, 5 అక్టోబరు 2023 (10:03 IST)
chiru-sathyanadh-pawn-nagababu
నటుడిగా కెరీర్ ప్రారంభించాలకునే వారికి కేర్ అఫ్ అడ్రెస్స్ వైజాగ్ సత్యానంద్ చిరంజీవి ఫామిలీ నుంచి ప్రభాస్, ఎం.టి.ఆర్.  ఎంతో మంది కొత్త పాత తరం వారికి గురువు ఆయన. నేటితో సినీ ప్రస్థానం లో  50 సంవత్సరాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా సత్యానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. 
 
webdunia
Chiru-sathyanadh
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి  స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన  డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు  స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక  గైడింగ్ ఫోర్స్  గా, ఒక  గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని  ప్రేమిస్తూ , సినిమానే ఆస్వాదిస్తూ , సినిమాని తన జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీవిద్యార్ధి , తరతరాల  సినీ ప్రముఖులoదరికీ  ప్రియ మిత్రులు,  నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు  తన   సినీ ప్రస్థానం లో  50 సంవత్సరాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా ఆయనకు  నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు. ఆయనతో  నా వ్యక్తిగత అనుబంధం ,  నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో  ప్రగాఢమైనది.  
 
Dearest Satyanand Garu , మీరిలాగే  మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ  పంచుతూ, మరెన్నో చిత్రాల  విజయాలకు  సంధాన కర్త గా, మరో  అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని  ఆశిస్తున్నాను. More Power to You !  అని పోస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్తర్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీగా లేతాకులు