Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లనాయక్ తిరిగి విధుల్లోకి వచ్చారు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (16:04 IST)
Pavan kalyan ph
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న తాజా సినిమాలో పోలీసు అధికారి భీమ్లనాయక్ గా న‌టిస్తున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఈ షూటింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్న స‌న్నివేశంలోని ఓ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. విధి నిర్వ‌హ‌ణ‌లో వున్న భీమ్ల నాయ‌క్ సీరియ‌స్‌గా ఎవ‌రితో మాట్లాడుతున్న‌ట్లుగా వుంది. ఇది `అయ్యప్పనుమ్ కోషియమ్‌` సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కుతోంది.

ఈ స్టిల్ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తుంద‌ని నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. అంతేకాదు సినిమాలో పవన్ భీమ్లనాయ‌క్ పాత్ర షిస్తున్నార‌ని కూడా వెల్లడించారు. సోమ‌వారంనాడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.
 
యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రానా కూడా న‌టిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ అద్భుతమైన యాక్షన్ పార్ట్ ను ప్లాన్ చేశారు. క్లైమాక్స్‌తో సహా మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇవి మెగా, రానా అభిమానులను, సినీ ప్రేమికులను థ్రిల్ చేయనున్నాయి. క్లైమాక్స్ తరువాత పవన్, నిత్యా మీనన్ మధ్య పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరించబడుతుంది. ఒకే షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని బృందం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments