Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతి - 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఈ మృతికి సంతాపసూచకంగా 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను రద్దు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో సోమవారం రాత్రి ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా, రాత్రి 8 గంటలకు ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి సంతాపసూచకంగా ఈ ప్రిరిలీజ్ వేడుకను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్ అధినేత నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
కాగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లతో పాటు విలన్ పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments