Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'భీమ్లా నాయక్'

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భీమ్లా నాయక్". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. 
 
ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన టైటిల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ.. "భీమ్లా నాయక్" నుంచి మరో పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి పవన్ అభిమానులను హుషారెత్తించింది.
 
టైటిల్ సాంగ్ థ‌మన్ సంగీత సార‌థ్యంలో రూపొంద‌గా, దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆలపించిన తీరు శ్రోతలను కట్టిపడేస్తోంది. 
 
దీంతో యూట్యూబ్ వ్యూస్‌పరంగా ఈ సాంగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికానుకగా ఈ సినిమా విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments