Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ లోడింగ్.. సెప్టెంబర్ 2న 11.16 నిమిషాలకు...?

Advertiesment
భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ లోడింగ్.. సెప్టెంబర్ 2న 11.16 నిమిషాలకు...?
, సోమవారం, 30 ఆగస్టు 2021 (21:11 IST)
వకీల్ సాబ్ మూవీతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ అంటూ కలెక్షన్ల మోత మోగించేందుకు వస్తున్నాడు. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్‌తో పాటు రానా నటిస్తున్నాడు. 
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం తో ఆ రోజంతా పవన్ హంగామా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
అంతకన్నా ముందే పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. 
 
సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరీ జగన్నాథ్‌తో ఈడీ దర్యాప్తు మొదలు