Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ నాన్ లోకల్.. కమల్, రజనీ లాంటి వాళ్లు?: భారతీ రాజా

ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కాని వారు రా

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (09:51 IST)
ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కాని వారు రాష్ట్రాన్ని పాలించేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని భారతీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దివంగత సీఎం జయలలిత మరణం, డీఎంకే చీఫ్ కరుణానిధికి అనారోగ్యంగా ఉండటం వల్లే రాజకీయాల్లోకి వస్తామంటూ కమల్, రజనీ వంటి వాళ్లు బయలుదేరారని, లేకుంటే వాళ్లు బయటకు వచ్చేవారా? అని ప్రశ్నించారు.
 
వయస్సులో ఉండగా హిమాలయాల వెంట తిరిగిన రజనీకాంత్.. ప్రస్తుతం వయస్సు మళ్లిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని వస్తున్నాడని ఎద్దేవా చేశారు. దర్శకుడు సీమాన్‌తో కలసి మీడియాతో మాట్లాడిన భారతీ రాజా.. విశ్వాస ఘాతుకానికి రజనీ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కనీసం నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)తో పోటీ పడలేని బీజేపీ, రజనీని అడ్డుపెట్టుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments