Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్ సీఎం అయితే ఇక వాళ్లు పడుకునే ప్రణామాలా?

ఏదైనా ఎక్కువగా తొక్కిపెడితే అది రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందనడానికి నిదర్శనంగా తమిళనాడును చెప్పుకోవచ్చనేది నిర్వివాదాంశం. ఏ ఒక్కరికీ... చివరికి కేంద్ర ప్రభుత్వానికైనా దాసోహమనే ఆలోచన రానివ్వకూడదంటూ నినదించి, అందులో భాగంగానే చివరికి జాతీయభాష హిందీని

రజినీకాంత్ సీఎం అయితే ఇక వాళ్లు పడుకునే ప్రణామాలా?
, బుధవారం, 10 జనవరి 2018 (12:36 IST)
ఏదైనా ఎక్కువగా తొక్కిపెడితే అది రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందనడానికి నిదర్శనంగా తమిళనాడును చెప్పుకోవచ్చనేది నిర్వివాదాంశం. ఏ ఒక్కరికీ... చివరికి కేంద్ర ప్రభుత్వానికైనా దాసోహమనే ఆలోచన రానివ్వకూడదంటూ నినదించి, అందులో భాగంగానే చివరికి జాతీయభాష హిందీని కూడా తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ ప్రజలు చివరికి వ్యక్తి పూజల ఊబిలో దిగిపోయి అందులోనే మునిగితేలుతున్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
 
నిన్నమొన్నటి వరకు సినిమా హీరోయిన్లకు గుళ్లు కట్టించిన తమిళ తంబీలు ఒక ఎత్తైతే... దివంగత నేత పురచ్చితలైవి అమ్మగారికి.. సీనియర్ మంత్రులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం సాగిలపడి దండప్రమాణాలు చేస్తూ... తమకు ఓటేసిన తంబీలకంటే తామే రెండాకులు ఎక్కువ చదివామనిపించారు.
 
కానీ, ఏదో మార్పు తెస్తారంటూ.. అందరూ ఎదురుచూస్తున్న తలైవాగారి రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన ఒక వీడియోలో అభిమానులు ఆయనకు ప్రదక్షిణలు చేస్తూండటం చూస్తూంటే... ఇప్పుడే ఇలాగుంటే మరి ఆయనగారు పదవిలోకి వచ్చిన తర్వాత అసలు నేలపై నిలబడతారా అనే సందేహం కలిగిస్తోంది.
 
ఈ వ్యక్తిపూజల ఊబి నుండి తమిళ తంబీలను బయటపడేసేందుకు ఏ దేవుడో వచ్చి గజేంద్రమోక్షం కలిగించవలసి ఉంటుందేమో మరి.. చూద్దాం.. వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో అంతస్థులో చిక్కుకున్న మహిళ.. ఓ వ్యక్తి ఎలా కాపాడంటే? (వీడియో)