Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్ కూడా తెలుగువారిని....

ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ ఇటీవలే తన రాజకీయ రంగప్రవేశాన్ని గురించి వెల్లడించారు. భవిష్యత్తులో తాను రాజకీయపరంగానూ దూసుకుపోతానని అభిమానులను ఉత్తేజపరుస్తున్నాడు. తమిళనాట నె

రజినీకాంత్ కూడా తెలుగువారిని....
, శుక్రవారం, 5 జనవరి 2018 (12:20 IST)
ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ ఇటీవలే తన రాజకీయ రంగప్రవేశాన్ని గురించి వెల్లడించారు. భవిష్యత్తులో తాను రాజకీయపరంగానూ దూసుకుపోతానని అభిమానులను ఉత్తేజపరుస్తున్నాడు. తమిళనాట నెలకొన్న అనిశ్చితిని తొలగించి మంచి పాలన అందిస్తానని భరోసా ఇస్తున్నాడు. 
 
ఇదిలావుంటే రజనీ ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ పక్కరాష్ట్రాల వారిని అవమానపరిచేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవేంటంటే రజనీ తన తదనంతరం తన ఆస్తులు మొత్తం సేవా ట్రస్ట్ ద్వారా తమిళ ప్రజలకు చెందుతాయని ప్రకటించడమేనట. అందులో తన అభిమానులు టిక్కెట్‌ల రూపంలో ఖర్చు చేసిన 5, 10, 20 రూపాయలతో కూడుకున్న మొత్తం సొమ్మును వారికే తిరిగి ఖర్చుచేస్తానని ప్రకటించాడు. ఇందులో తప్పేముంది అనుకోవచ్చు. కానీ అక్కడే తేడా కొడుతోందంటున్నారు. 
 
తన సినిమాలను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో రిలీజు చేసి సొమ్ము చేసుకునే రజనీ, తెలుగు ప్రజలకు మాత్రం ఆ సొమ్మును పంచిపెట్టరా అని తెలుగు అభిమాన సంఘాలు వాపోతున్నాయి. తన సినిమాలకు తమిళం తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న తెలుగును మాత్రం విస్మరించారు. 
 
తెలుగులోనూ ఎన్నో స్ట్రెయిట్ చిత్రాలు చేసి విజయాలను అందుకున్నాడు. తెలుగు అనువాద చిత్రాలుగా వచ్చినవి బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవడమే కాకుండా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్‌తో తెలుగు అభిమానులు, ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ కాలా, రోబో 2.0 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రాల విడుదల సమయంలో చోటుచేసుకునే పరిణామాలపై రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామాంధుల వేధింపులు భరించలేను.. పిల్లలను చంపి సూసైడ్ చేసుకుంటున్నా