Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస ఫ్లాప్‌లు ఉన్నా... నిర్మాతలు క్యూ కడుతున్నారు.. ఎందుకని?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:58 IST)
అనూ ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర సీమలో ఒక చిన్న చిత్రంతో అడుగుపెట్టింది. ఆ చిత్రం ఎపుడు విడుదలైందో.. ఎపుడు పరాజయం పాలైందో ఎవరికీ తెలియదు. 
 
అయినప్పటికీ.. అనూకు మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ చిత్రాల్లో నటించాలని కోరుతూ నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారు. సహజంగా హీరోయిన్ల తొలి చిత్రం ఫ్లాప్ అయితే వారి కెరీర్‌లో నిలదొక్కుకోవడం చాలా అంటే చాలా కష్టం. కానీ అను మాత్రం మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడకపోయినా కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. 
 
అలాంటి గోల్డెన్ ఛాన్స్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్‌ను ఏ హీరోలు కూడా తమ సినిమాల్లో బుక్ చేసుకోవాలనుకోరు. 
 
కానీ వరుసగా రెండు పెద్ద ఫ్లాప్‌లు పడినప్పటికీ కూడా అనూకు మంచి ఆఫర్లు వచ్చాయి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే "శైలజా రెడ్డి అల్లుడు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అను ఇమాన్యూల్ తన ప్రతి సినిమాలో కూడా స్కిన్ షోతో ముద్దు సీన్లతో కేక పుట్టిస్తోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నా పాత్రలకు మంచి పేరు దక్కింది. నేను చేసిన సినిమాల్లో నా నటన నచ్చడం వల్లే నాకు మళ్లీ మళ్లీ ఆఫర్లు వస్తున్నట్టు' చెప్పుకొచ్చింది. వరుసగా ఫ్లాప్ల నుండి చాలా నేర్చుకున్న నేను కొత్త సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments