జానీ మాస్టర్ బిహేవియర్‌పరంగా చాలామంచి వ్యక్తి : బషీర్ మాస్టర్

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (11:44 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ గురించి మరో కొరియో గ్రాఫర్ బషీర్ మాస్టార్ స్పందించారు. 'జానీ మాస్టర్ బిహేవియర్ పరంగా చాలా మంచి వాడు, నేను ఆయనతో కలిసి తిరిగాను. ఆయనతో కలిసి చాలా చోట్ల కొరియోగ్రాఫర్‌గా చేయడానికి కూడా వెళ్లాను. నాకు ఆయనతో 15 సంవత్సరాల పరిచయం ఉంది. ఇద్దరం కలిసి నమాజ్ కూడా వెళ్లేవాళ్ళం. ఆయనతో నా అనుభవం ఏందంటే ఆయన హార్డ్ వర్కర్. అలాంటి వాడి గురించి నేను ఇలాంటి విషయం వినాల్సి వస్తుందని అనుకోలేదు.
 
ఈ విషయం చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఏంటి ఇలాంటి వార్త చూశాను అని చాలా బాధపడ్డాను. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే మాటలు కాదు. నేషనల్ అవార్డు కూడా ఈ మధ్య వచ్చింది. అంతా గొప్ప స్థాయికి వెళ్లిన జానీ మాస్టర్ గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఏది ఏమైనా ఆ అమ్మాయి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు ఇచ్చింది. జానీ మాస్టర్ ఇంతవరకు బయటికి వచ్చి ఎక్కడ ప్రెస్మీట్ ఇవ్వలేదు. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడలేము.
 
షూటింగ్‌కి వెళితే అక్కడ, అసిస్టెంట్‌ని వేధించేంత టైం ఉండదు. చాలా బిజీగా సాంగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక సాంగ్ కంపోజిషన్ చేసేటప్పుడు లంచ్ టైంలో విశ్రాంతి తీసుకోవడం, తర్వాత ఏ లొకేషన్ లో షూట్ చేయాలి? అని ఆలోచిస్తుంటారు. అలాంటిది లంచ్ టైంలో జానీ మాస్టర్ అమ్మాయిని ఎక్కువ వేధించేవాడని వినడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనా కేసు దర్యాప్తు అయితే జరుగుతోంది. ఆ అమ్మాయి చెప్పినట్లు వాళ్ల మధ్య ఏం జరిగిందన్నది బయటికి వస్తేగాని పూర్తిగా తెలియదు. వాళ్ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటన్నది మనకి తెలీదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము' అని తన అభిప్రాయాన్ని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments