Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 14న బంగార్రాజు.. సంక్రాంతికి చరిత్రను తిరగరాయడం ఖాయం

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (19:32 IST)
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా సంక్రాంతికి రాబోతోంది. జనవరి 14న బంగార్రాజు రాబోతోన్నట్టు ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 
 
గత ఏడాది సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా పండుగకు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఇప్పుడు, బంగార్రాజు చరిత్రను తిరగరాయడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.  
 
ఈ చిత్రంలో నాగార్జున భార్యగా రమ్య క్రిష నటిస్తుండగా, నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి కనిపించనుంది. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఒక ప్రత్యేక గీతంలో ఆడి పాడింది. ఈ చిత్రంలో నాగబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ యువరాజ్, సంగీతం అనూప్ రూబెన్స్‌లు అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాయడం జరిగింది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శునకంతో స్టంట్ చేసిన వ్యక్తి.. రైలు కింద పడిపోయింది.. తిట్టిపోస్తున్న నెటిజన్లు (video)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments