Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్జీవికి బదులిచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని: అయినా ట్రోలింగ్ ఆగలేదు

Advertiesment
ఆర్జీవికి బదులిచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని: అయినా ట్రోలింగ్ ఆగలేదు
, బుధవారం, 5 జనవరి 2022 (12:01 IST)
ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ఆర్జీవీ ప్రశ్నిస్తున్నాడు. నిన్న ట్విట్టర్‌లో ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధించి సమాధానాలు ఇమ్మని అడిగాడు. ఈ ప్రశ్నలకు పేర్ని నాని ఆర్జీవీ ప్రశ్నలకి సమాధానాలిస్తూ… గౌరవనీయులైన ఆర్జీవీ గారు మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. 
 
రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.
 
ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.
 
సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు ఆర్జీవీ గారు. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి. ఇలా కొన్ని ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చారు.
 
అయితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలివ్వకపోవటం, కొన్ని ప్రశ్నలకి అడిగిన దానికి కాకుండా వేరే విధంగా సమాధానాలివ్వడంతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి మూడ్ ఆఫ్! రాధేశ్యామ్ విడుద‌ల వాయిదా!!