ప్రముఖ దర్శకుడు నిర్మాత బండ్ల గణేష్ చెక్కు బౌన్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్‌కి ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ చిత్రానికి కథ అందించిన తనకి రెమ్యునరేషన్ ఆపినందుకుగాను రచయిత వక్కంతం శీను కోర్టును ఆశ్రయించ
ప్రముఖ దర్శకుడు నిర్మాత బండ్ల గణేష్ చెక్కు బౌన్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్‌కి ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ చిత్రానికి కథ అందించిన తనకి రెమ్యునరేషన్ ఆపినందుకుగాను రచయిత వక్కంతం శీను కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించాలని తెలిపింది.
అయితే గణేష్ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే ఈ వివాదంపై బండ్ల గణేష్ తాజాగా స్పందించారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా బహిరంగ లేఖను పోస్టు చేశాడు. ఆ లేఖలో జరిగిన వివరాలను పొందుపరిచి వివరణ ఇచ్చాడు.
ఆ లేఖలో ఏముందంటే? 2015 టెంపర్ చిత్రం వివాదం ఇది. కోటి నాలుగు లక్షల రూపాయలకు ''టెంపర్'' కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొన్నాను. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక, నిర్మాత అయిన రోహిత్ శెట్టికి సంయుక్తంగా విక్రయించాం. కానీ, నాకు తెలియకుండా టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు.
దీని వల్ల నేను తీవ్ర మనస్తాపానికి లోనై, విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టికి తీసుకువెళ్లా. అదే సమయంలో ''టెంపర్'' చిత్ర కథకి ఇచ్చిన బ్యాలెన్స్ డబ్బుల చెక్‌ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్నప్పటికీ వంశీ చెక్‌ను పట్టుకొని కోర్టుకి వెళ్లారు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇచ్చింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్‌కు వెళ్తున్నాను. రచయిత వంశీపై న్యాయ పోరాటం సాగిస్తాను.. అంటూ బండ్ల గణేష్ తెలిపారు.