Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు.. వెనక్కి తగ్గిన "మా".. శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేత

కాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తూ, హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనలు చేసిన నటి శ్రీరెడ్డి వ్యవహరాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) సుమోటాగా స్వీకరించి, తెలంగాణ సర్కారు, క

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:12 IST)
కాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తూ, హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనలు చేసిన నటి శ్రీరెడ్డి వ్యవహరాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) సుమోటాగా స్వీకరించి, తెలంగాణ సర్కారు, కేంద్ర ప్రసార శాఖామంత్రికి నోటీసులు జారీ చేసింది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిగివచ్చింది.
 
నటిపై శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అంతేకాదు మ‌హిళా న‌టులు తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను చెప్పుకునేందుకు వీలుగా క్యాష్ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌లో ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో మీడియా స‌మావేశంలో జెమినీ కిర‌ణ్, మా అధ్య‌క్షుడు శివాజీ రాజా, న‌రేష్‌లు ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై మాట్లాడారు. 
 
శ్రీ‌రెడ్డి అర్థన‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేయడంతో ఎమోష‌న‌ల్‌గా ఫీలై మాత్ర‌మే ఆమెపై నిషేధం నిర్ణ‌యం తీసుకున్నామన్నారు. ఇక నుంచి శ్రీ‌రెడ్డి ఏ మూవీలోనైనా, ఎవ‌రితోనైనా న‌టించ‌వ‌చ్చ‌ని, ఆమె కూడా మా కుటుంబంలో స‌భ్యురాల‌ని తెలిపారు. శ్రీ‌రెడ్డి మా స‌భ్య‌త్వం విష‌యంలో త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.
 
సినీ పరిశ్రమలో అవకాశాలు 'మా' ఇవ్వదని.. దర్శక నిర్మాతలే ఇస్తారన్నారు 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా. మా కోరిక ప్రకారం తెలుగువారికి అవకాశాలు ఇవ్వాలని దర్శక నిర్మాతలను కోరుతున్నామన్నారు. శ్రీరెడ్డిపై ఎలాంటి బ్యాన్ లేదన్న శివాజీరాజా.. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

దక్షిణాదిలో బీజేపీ ప్రచారాస్త్రంగా పవన్ కళ్యాణ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం