అక్కడే వున్న కేన్సర్ రోగులకు చెందిన చిన్నపిల్లలను పలుకరించి వారికి కావాలసిన వస్తు సామాగ్రిని అందజేశారు. వారి సమక్షంలోనే కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పసిమనసులుతో నేను అంటూ చమత్కరించారు. మా ప్రియమైన గౌరవ ఛైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తన 60 వ పుట్టినరోజున మాతో కలిసి ఉండటం నిజంగా అదృష్టం అని ట్రస్ట్ బోర్డు సభ్యుడు శ్రీ జెఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు.ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల ఆయన అభిమానులు పేదలకు పళ్లు, వస్తువులు అందజేశారు.
Balakrishna-yuvarajsing
ఇక సినిమారంగానికి చెందిన పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చార్మి కూడా ఆయనతో ఓ ఫంక్షన్‌లో వున్న ఫొటోను షేర్ చేసింది. ఒకవైపు సినీప్రముఖులు, రాజకీయనాయకుల శుభాకాంక్షలతో బిజీగా వున్న బాలకృష్ణను ప్రముఖ డాషింగ్ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలకృష్ణతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి చెప్పిన విషెష్ ఈరోజుని మరింత స్పెషల్ గా మార్చాయి.