Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కావాలంటే, ఎలా కావాలంటే... ఆ రేంజ్‌లో బాలయ్య చిత్రం ఉంటుంది : పూరీ జగన్నాథ్

నందమూరి బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 101వ చిత్రం ప్రారంభమైంది. ఈనెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పూరీ మాట్లాడుతూ.... తాను నందమూరి బా

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (10:04 IST)
నందమూరి బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 101వ చిత్రం ప్రారంభమైంది. ఈనెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పూరీ మాట్లాడుతూ.... తాను నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా తీయాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశానని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. 
 
తనకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణను ఎన్నటికీ మరచి పోలేనని అన్నాడు. ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని తనకుందని చెప్పాడు. అదేసమయంలో 'నేను మీ అభిమానులందరికీ మాటిస్తున్నాను. మీకు ఏం కావాలంటే, ఎలా కావాలంటే... ఆ రేంజ్‌లో వుంటుంది. సో... ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్‌గానీ... జై బాలయ్య. సినిమా వెంటనే ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 29న రిలీజ్... కావాలంటే ఒకరోజు ముందే అయినా రిలీజ్‌కు రెడీ. థ్యాంక్యూ, థ్యాంక్యూ సోమచ్' అని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలావుండగా, బాలకృష్ణ కొత్త సినిమాలోని ఏదైనా ఓ డైలాగ్ చెప్పాలని 101వ చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అభిమానులు కేకలు పెట్టారు. దీనికి పూరీ స్పందిస్తూ... "ఒక డైలాగు కాదు... ఆడియో సీడీ వేసుకునేన్ని డైలాగులు ఉంటాయి" అని అభిమానుల ఆనందోత్సాహాన్ని మరింతగా పెంచాడు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పాడు. అభిమానులు ఊహించే దానికన్నా ఎక్కువ సంతృప్తిని ఇచ్చేలా చిత్రాన్ని తయారు చేస్తానని హామీ ఇచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments