Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్.... సినిమా పేరు 189 కాదు.. 118 :: హీరోలు చెవిలో చెప్పినా సరిదిద్దుకోని బాలయ్య

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (09:30 IST)
టాలీవుడ్ సీనియర్  హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన వేదికలెక్కినపుడు ప్రారంభించే ప్రసంగం ఎటువైపు వెళుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా.. ఎక్కడ మొదలుపెట్టి.. ఎక్కడ ఆపుతారో స్వయానా బాలయ్య బాబుకే తెలియదు. దీంతో ఆయన ప్రసంగంలో దొర్లే తప్పుల కోసం ప్రత్యర్థి మీడియా కాచుకుని ఉంటుంది. తాజాగా మరోమారు అలాంటి ప్రసంగమే చేశారు బాలయ్య. 
 
నందమూరి కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "118". ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు విస్తుపోయేలా చేసింది. అలాగే, నెటిజన్లు కూడా బాలయ్య బాబును ఓ ఆటాడుకుంటున్నారు. 
 
సోమవారం '118' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలయ్య.. కనీసం సినిమా పేరును కూడా సరిగ్గా ఉచ్ఛరించలేక పోయారు. అలా ఒకటి కాదు.. రెండు కాదు. పదేపదే సినిమా పేరును తప్పుగా పలికారు.
 
'118'గా ఉన్న సినిమా పేరును బాలయ్య '189'గా చెబుతూ ఉంటే.. వేదికపై ఉన్నవారు ఆశ్యర్యపోయారు. అంతేకాదండోయ్... ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు దగ్గరికి వచ్చి.. చెప్పినా సరిచేసుకోలేకపోయారు. మళ్లీ ఆఖర్లో '189' అంటూనే ముగించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments