Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్యని చూస్తే జాలేస్తోందన్న బాలీవుడ్ భామ...

Advertiesment
బాలయ్యని చూస్తే జాలేస్తోందన్న బాలీవుడ్ భామ...
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:40 IST)
సాధారణంగా బాలయ్యని చూస్తే భయపడే హీరోయిన్లనే చూసి ఉంటాం... ఆయనకు తన తండ్రి నుండి వచ్చిన క్రమశిక్షణ... నడవడిక అలాంటివి. అయితే.. తాజాగా విడుదలైన మహానాయకుడు విషయంలో బాలీవుడ్ భామ కంగనా ఆయనపై జాలి వ్యక్తం చేసింది... వివరాలలోకి వెళ్తే... క్రిష్‌ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండో భాగం మహానాయకుడు గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను అందుకుంటున్నప్పటికీ, కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం వెనకబడిందని సినీ వర్గాల ద్వారా తనకు తెలిసిందని వివరించిన కంగనా ఇదే మంచి అవకాశమనుకుని క్రిష్‌పై కామెంట్లు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఆవిడ తన ప్రకటనలో, "నేను ఎన్టీఆర్ : మహానాయకుడు కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు చెప్పండి.. నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాంబదుల్లా పీక్కుతిన్నారు. ఇప్పుడేమంటారు? బాధాకరమైన విషయం ఏమిటంటే.. క్రిష్‌తోపాటు కొన్ని మీడియా వర్గాలు కూడా 'మణికర్ణిక'పై దుష్ప్రచారం చేసాయి. (లక్ష్మీబాయిని ఉద్దేశిస్తూ) మన స్వాతంత్ర సమరయోధులు దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందినందుకు నాకు చాలా బాధగా ఉంది" అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద బాలయ్య మీద ఆవిడ జాలి పడుతోంటే... చాలా మంది క్రిష్‌పై జాలి పడుతున్నారనే... గుసగుసలు వినబడుతున్నాయ్...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా దర్శకురాలు అనుమానాస్పద మృతి