Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి మూవీలో బాలయ్య అఘోరా క్యారెక్టర్ చేయడం నిజమేనా..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (20:49 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ అవ్వడం తెలిసిందే. దీంతో బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో రానున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 
 
రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా ప్రారంభమైంది. లాక్ డౌన్ వలన షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇందులో బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.
 
 అయితే.. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి అఘోరా పాత్ర అంటూ వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా అని బోయపాటిని అడిగితే.. నిజమే అని చెప్పారు. 
 
అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం.., ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సింహా, లెజెండ్ నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే అని బోయపాటి అన్నారు. మరి.. బాలయ్య అఘోరా గెటప్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments